5 గంటల పాటు హైవేపై ట్రాఫిక్​ను అడ్డుకున్నరు

5 గంటల పాటు హైవేపై  ట్రాఫిక్​ను అడ్డుకున్నరు

 

వంద రోజులు దాటిన రైతుల ఆందోళన

కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ బార్డర్లలో రైతులు చేస్తున్న ఆందోళన శనివారం నాటికి వంద రోజులు దాటింది. సంయుక్త్ కిసాన్ మోర్చా పిలుపు మేరకు  రైతులు హైవేలను బ్లాక్ చేశారు.  హర్యానాలోని 136 కిలోమీటర్ల పొడవైన కుండ్లి– పల్వాల్ ఎక్స్ ప్రెస్ వే ను బ్లాక్ చేశారు.  ట్రాక్టర్లతో రైతులు, మహిళలు,  ఆందోళనకారులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

 

న్యూఢిల్లీ/చండీగఢ్: కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ బార్డర్లలో రైతులు చేస్తున్న ఆందోళన శనివారం నాటికి వంద రోజులు దాటింది. సంయుక్త్ కిసాన్ మోర్చా పిలుపు మేరకు  రైతులు హైవేలను బ్లాక్ చేశారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు హర్యానాలోని ఆరు లేన్ల కుండ్లి= మనేసర్= పల్వాల్ (కేఎంపీ) ఎక్స్ ప్రెస్ వే పై నిరసన తెలిపారు. సోనీపత్ జిల్లాలో రైతులు ట్రాక్టర్ల ట్రాలీలను హైవేకు అడ్డంగా పెట్టారు. 136 కిలోమీటర్ల పొడవైన ఈ ఎక్స్ ప్రెస్ వే పై తమ యూనియన్ల జెండాలతో రైతులు, మహిళలు, ఆందోళనకారులు నిరసనకు దిగారు. ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించేవరకు ఇక్కడి నుంచి కదలబోమని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ స్పష్టం చేశారు. చాలా కాలం పోరాటానికి తాము రెడీ అయినట్లు తెలిపారు. మూడున్నర నెలలుగా కొనసాగుతున్న ఆందోళనల్లో దాదాపు 200 మంది రైతులు వివిధ కారణాలతో మరణించారు. కిందటేడాది సెప్టెంబర్ లో కేంద్రం తీసుకొచ్చిన అగ్రి చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా రైతులు తమ రాష్ట్రాల్లో కొన్ని వారాలపాటు ఆందోళనలు చేశారు. తర్వాత ఢిల్లీ చలో కార్యక్రమానికి పిలుపునిచ్చారు. నవంబర్ 26న పాదయాత్రగా ఢిల్లీ బార్డర్లకు చేరుకుని సింఘు, టిక్రి ఇతర ప్రాంతాల్లో హైవేలపై బైఠాయించి నిరసన ప్రారంభించారు. ఉత్తర ప్రదేశ్ రైతులు కూడా వీరితో జత కలిసి ఘాజీపూర్లో హైవేపై ఆందోళనకు దిగారు. అగ్రి చట్టాలను వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం, రైతుల మధ్య పలు రౌండ్లు చర్చలు జరిగినా.. అవి ఓ కొలిక్కి రాలేదు.

రైతులను ఆపడానికి ముళ్లకంచెలా?: రాహుల్

రైతుల బిడ్డలు దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తుంటే.. ప్రభుత్వం మాత్రం ఇక్కడ రైతులను అడ్డుకునేందుకు ముళ్ల కంచెలు వేస్తోందని కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ మండిపడ్డారు. ‘బార్డర్లో ఎవరి కుమారులైతే ప్రాణాలను పణంగా పెడుతున్నారో.. వారికి ఢిల్లీ బార్డర్లలో కంచెలు వేశారు. ప్రభుత్వం దారుణాలకు పాల్పడుతోంది’ అని ట్వీట్ చేశారు.